అన్ స్టాపబుల్ సీజన్ 2.. బాబు నుంచి పవన్ వరకు.. క్రేజ్ మామూలుగా..?
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 తొలి ఎపిసోడ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా అన్ స్టాపబుల్ సీజన్ 2 లో సందడి చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఇదే షోకి పవన్ కళ్యాణ్ ఈ షోకి రాబోతున్నాడని.. బాలకృష్ణతో ముచ్చట్లు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎపిసోడ్‌ని ఈ సీజన్ యొక్క చివరి ఎపిసోడ్‌గా స్ట్రీమింగ్ చేయాలని ఆహా వారు భావిస్తున్నారట. సీజన్ 1 మొదటి ఎపిసోడ్ మోహన్ బాబుతో చేయగా చివరి ఎపిసోడ్‌ని మహేష్ బాబుతో పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
అలాగే సీజన్-2కి కూడా మంచి ఎండింగ్ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఉంటే తప్పకుండా సీజన్-3 కి అంతకు మించి అన్నట్లుగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుందని ఆహా భావిస్తున్నట్లు తెలుస్తోంది.