బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు నోటీసులు

navdeep
హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటుడు నవదీప్‌కు హైదరాబాద్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు జారీచేశారు. 41ఏ కింద వీటిని నవదీప్‌కు అందచేసి, ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. 
 
ఇటీవల వెలుగులోకి వచ్చిన మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నవదీప్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. 
 
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ఏ37గా ఉన్న తన ఫ్రెండ్ రామ్ చరణ్‌తో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో తన పేరు వినపడగానే నవదీప్ హైకోర్టును ఆశ్రయించి, అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నవదీప్‌కు షాకిస్తూ, విచారణకు నవదీప్ సహకరించాలని ఆదేశించారు.