మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (17:25 IST)

ప్రభాస్ ఫేస్‌‍బుక్‌ రికార్డ్...10 మిలియన్ల ఫాలోవర్స్‌ సాధించిన తొలి హీరోగా?

''సాహో'' సినిమా విడుదల కాకముందే రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డుల పంట పండిస్తున్నాడు. బాహుబలితో ప్రపంచ సినీ అభిమానులకు బాగా పరిచయమైన ప్రభాస్.. తాజాగా సోషల్ మీడియాలో కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. 
 
సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌ను మాత్రమే ప్రభాస్ వాడుతున్నాడు. ఇందులో ప్రభాస్ ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్స్‌కు చేరింది. చాలా తక్కువ టైమ్‌లో ప్రభాస్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. దక్షిణాదిన 10 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న తొలి హీరోగా ప్రభాస్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
 
ఇదిలా ఉంటే రూ.200 కోట్ల భారీ బడ్జెట్ మూవీ సాహో సినీ యూనిట్ త్వరలో ఒడిశాలోని కటక్‌లో సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 28న జరిగే పురుషుల హాకీ ప్రపంచకప్ ప్రారంభోత్సవానికి ప్రభాస్, శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముఖేష్ హాజరవుతారని టాక్.