శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (15:44 IST)

ఫేస్‌బుక్‌ను ఎన్ని గంటలు వినియోగిస్తున్నారు.. తెలిసిపోతుంది.. ఇలా?

వెరీ గుడ్ అని చెప్పేలా.. సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్.. తదుపరి సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఫేస్‌బుక్‌లో ప్రస్తుతం పెట్టుబడిదారుల మధ్య దాయాదుల పోరులాంటి వార్ నడుస్తోంది. ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్ మార్గ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని పెట్టుబడిదారులు పట్టుబడుతున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ షేర్లు పడిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్‌ను అమలు చేసే దిశగా రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా.. ఫేస్‌బుక్‌లో యువర్ టైమ్ ఆన్ ఫేస్‌బుక్ అనే ఫీచర్‌ ప్రారంభమైంది. దీని ద్వారా వినియోగదారులు ఎన్ని గంటల సేపు ఫేస్‌బుక్‌ను ఉపయోగించారనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఫేస్‌బుక్‌ను వినియోగించే సమయాన్ని ఇందులో సెట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు ఫేస్ బుక్ సంస్థ వెల్లడించింది.