సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2024 (10:48 IST)

ఆకట్టుకున్న 4kతో ప్రభాస్ ఈశ్వర్ రీ రిలీజ్ ట్రైలర్

Prabhas - Eshwar
Prabhas - Eshwar
పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ వదిలిన ఈశ్వర్ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
 
నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది అంటూ ప్రభాస్ చెప్పిన మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్ ఇలా అన్నింటినీ ట్రైలర్‌లో పొందు పర్చారు. ఈ మూవీని జయంత్ సీ పరాన్జీ తెరకెక్కించారు. కె. అశోక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీని లక్ష్మీ నరసింహా మూవీస్  రీ రిలీజ్‌ చేస్తున్నారు.
 
అసలే టాలీవుడ్ ఆడియెన్స్ అంతా కూడా రీ రిలీజ్‌లను ఓ పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ప్రభాస్ బర్త్ డేని కూడా ఈశ్వర్ రీ రిలీజ్‌తో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే ప్రభాస్‌కి ఇప్పుడు పెరిగిన ఫాలోయింగ్, ఫాలోవర్లకు ఈశ్వర్‌ను థియేటర్లో ఎంజాయ్ చేయలేకపోయారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియన్ ఫాలోయింగ్‌కు తగ్గట్టుగా ఈశ్వర్‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. వింటేజ్ ప్రభాస్ మేనియాను డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఈశ్వర్ 4kతో సెలెబ్రేట్ చేసుకోబోతోన్నారు.