బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (17:53 IST)

కమల్‌కు ప్రకాష్ రాజ్ మద్దతు.. ఇది హిందూ ఉగ్రవాదం కాదా? #justasking

సినీ లెజెండ్ కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో ఉగ్రవాదులు ఉన్నారని, వారితో చాలా ప్రమాదం ఉందనే అర్థంలో కమల్ హాసన్ వ్యాఖ్యలు చేయడంతో చాలామంది పౌరులు సోషల్ మీడియా వేదికగా మండిపడ

సినీ లెజెండ్ కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో ఉగ్రవాదులు ఉన్నారని, వారితో చాలా ప్రమాదం ఉందనే అర్థంలో కమల్ హాసన్ వ్యాఖ్యలు చేయడంతో చాలామంది పౌరులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అయితే కమల్ హాసన్‌కు విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ మద్దతు తెలిపారు. మతం, సంప్రదాయం పేరిట ప్రజల్లో వణుకు పుట్టించడం ఉగ్రవాదం కాక మరేంటని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించాడు. 
 
నైతికత పేరుతో దేశంలోని ప్రేమ జంటలపై దాడు చేయడం ఉగ్రవాదం  కాదా? అడిగాడు. గోర‌క్షుల పేరుతో దాడుల‌కు పాల్ప‌డుతూ చ‌ట్టాన్ని త‌మ చేతుల్లోకి తీసుకోవ‌డం టెర్ర‌రిజం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది హిందూ ఉగ్రవాదం కాక మరేంటని? నాకు తెలియక అడుగుతున్నాను. సమాధానం చెప్పండి అంటూ ఎదురుప్రశ్న వేశారు. 
 
అయితే హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్‌పై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తమిళనాడుకు చెందిన హిందూ మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు అర్జున్ సంపత్ చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ కమల్ హాసన్ వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా హిందూవులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
విశ్వరూపం సినిమా విడుదల సమయంలో ముస్లింల నిరసన దెబ్బ ఎలా వుంటుందో కమల్‌కు తెలిసిందని.. ప్రస్తుతం హిందువులకు కమల్ క్షమాపణలు చెప్పకపోతే పరిస్థితి వేరే విధంగా వుంటుందని సంపత్ హెచ్చరించారు.