శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (13:15 IST)

హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు: కమల్ హాసన్

తమిళ అగ్రహీరో కమల్ హాసన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారంటూ తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్లే ఉగ్రవాదాన్ని హిందువులు గట్టిగా వ్యతిరేకించలేని పరిస్థితి వచ్చిందన్నార

తమిళ అగ్రహీరో కమల్ హాసన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారంటూ తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్లే ఉగ్రవాదాన్ని హిందువులు గట్టిగా వ్యతిరేకించలేని పరిస్థితి వచ్చిందన్నారు. 
 
ట్విట్టర్‌లో రోజుకొక కామెంట్ పోస్టు చేసే కమల్ ఇప్పుడొక తమిళ పత్రికకు కూడా వ్యాసాలు రాశారు. హిందూవాదులు ఇప్పుడు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించలేని పరిస్థితి వచ్చిందని కమల్ ఆ వ్యాసంలో రాశారు. హిందూ వర్గాల్లో కూడా ఉగ్రవాదం వ్యాపించిందన్నారు. 
 
గతంలో హిందువులు ఎలాంటి సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకునేవారని, పాత పద్ధతులకు స్వస్తి చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు హింసకు దిగుతున్నారని కమల్ విశ్లేషించారు. బలప్రదర్శన ఒక్కటే మార్గమని, హిందువుల్లో అతివాదులు నిర్ణయానికి వచ్చారని ఆయన అన్నారు. రాజకీయ పార్టీ పెట్టేందుకు కమల్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.