బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 4 అక్టోబరు 2017 (19:20 IST)

మీకు దండం పెడతా.. నన్ను రోడ్డుపైకి లాగొద్దండీ... కమల్ వేడుకోలు

నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా.. అయితే కొద్దిగా టైం పడుతుంది. అంతవరకు నన్ను రోడ్డుపైకి లాగొద్దండి.. నా గురించి ఎక్కడా మాట్లాడొద్దండి.. నేనే మాట్లాడతా. మీరు దయచేసి ఎక్కడా రాజకీయ ప్రస్తావన చేయవద్దండి.. ఇది విశ్వనటుడు కమల్ హాసన్ తన అభిమాన సంఘాలకు చ

నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా.. అయితే కొద్దిగా టైం పడుతుంది. అంతవరకు నన్ను రోడ్డుపైకి లాగొద్దండి.. నా గురించి ఎక్కడా మాట్లాడొద్దండి.. నేనే మాట్లాడతా. మీరు దయచేసి ఎక్కడా రాజకీయ ప్రస్తావన చేయవద్దండి.. ఇది విశ్వనటుడు కమల్ హాసన్ తన అభిమాన సంఘాలకు చెప్పిన మాటలు. తన రాజకీయ అరగేట్రం గురించి రోజుకో విధంగా ప్రచారం జరుగుతుంటే వెంటనే స్పందించిన కమల్ హాసన్ అభిమాన సంఘాలతో ఈరోజు సమావేశమయ్యారు. 
 
నా రాజకీయ ప్రవేశం గురించి అభిమాన సంఘాలు టివీ ఇంటర్వ్యూలలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. అలాంటివి దయచేసి మాట్లాడవద్దు. ఇక నిలిపేయండి.. ఏదైనా ఉంటే నేను చెబుతాను.. అంతవరకు సైలెంట్‌గా ఉండండి. ఇది నా వేడుకోలు అంటూ అభిమాన సంఘాలకు రెండు చేతులెత్తి కమల్ హాసన్ దండం పెట్టేశారు. దీంతో అభిమానులందరూ అలాగే అంటూ తలలూపారు కానీ.. కమల్ చెప్పినట్లు సైలెంట్‌గా ఉంటారా లేదా అన్నదే వేచి చూడాల్సిందే.