ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (20:46 IST)

'ప్రేమమ్‌' ఫేమ్ గ్లామర్ కెరటం మడోన్నా సెబాస్టియన్ ట్రెడిషనల్ లుక్

Madonna Sebastian
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
ఈ 30 ఏళ్ల ముద్దుగుమ్మ తొలుత గాయనిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఐతే ఆమె గ్లామర్ లుక్స్ అదిరిపాటుగా వుండటంతో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. 2015లో మలయాళం ప్రేమమ్ చిత్రంతో తెరంగేట్రం చేసి సూపర్ హిట్ కొట్టింది మడోన్నా. ఇదే చిత్రం తమిళం, తెలుగు, కన్నడలోనూ విడుదలై విజయం సాధించాయి.

 
Madonna Sebastian
ఇటీవలే నేచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంలో నటించి మెప్పించింది. కర్నాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్న సెబాస్టియన్ చక్కగా పాడుతుంది. మలయాళం సంగీత దర్శకుల దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడింది.

Madonna Sebastian
బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ పుచ్చుకున్నప్పటికీ తనలో సినిమాల పట్ల వున్న ఆసక్తి కారణంగా సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని మొదటి చిత్రంతోనే సక్సెస్ కొట్టింది. ఐదో దక్షిణాది అంతర్జాతీయ మూవీ అవార్డ్స్ విభాగంలో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ నటిగా ప్రేమమ్ చిత్రానికి నామినేట్ అయ్యింది.

Madonna Sebastian
అంతేకాదు 2021లో బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును షీ అవార్డ్స్ ఇండియా నుంచి గెలుచుకుంది. సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ పైనా కన్నేసింది. ఈ ఏడాది తమిళంలో కయ్యూమ్ కలవుమ్ అనే వెబ్ స్టోరీలో నటిస్తోంది.