శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (16:35 IST)

పంజాబ్‌ సింగర్‌పై హత్యాయత్నం... ఆస్పత్రి బెడ్‌పై..

Singer
Singer
ప్రముఖ పంజాబ్‌ సింగర్‌పై హత్యాయత్నం జరిగింది. ప్రముఖ సింగర్ సిద్దు మూసేవాలా హత్య ఘటన మరవకముందే మరో పంజాబీ సింగ్‌పై దాడి జరగడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. 
 
శనివారం రాత్రి పాపులర్ సింగర్ అల్ఫాజ్ సింగ్ అలియాస్ అమన్ జోత్ సింగ్ పన్వర్‌పై హత్యాయత్నం జరిగినట్లు పంజాబీ ర్యాపర్‌ హనీ సింగ్ సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. 
 
ఈ మేరకు అల్ఫాజ్ సింగ్ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ హనీ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ప్రమాదంలో అల్ఫాజ్ సింగ్ తలకు, చేతికి బలమైన గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.