శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (11:03 IST)

మెగా ఫ్యామిలీ క్షమించినా.. ఫ్యాన్స్ వదిలే ప్రసక్తే లేదు.. ఆర్జీవీ ఫైర్

Ram Gopal Varma
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్‌ల మధ్య జరిగిన వివాదంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు. 
 
'మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ' ఆర్జీవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీ ఆ ట్వీట్‌లో తనదైన శైలిలో గరికపాటిపై విరుచుకుపడ్డారు.
 
కాగా.. ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో 'చిరంజీవి ఫొటో సెషన్‌ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా' అని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.