గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

గౌరవ న్యాయమూర్తుల్లారా సలాం.. ప్రకాష్ రాజ్

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు.. అపెక్స్ కోర్టు పని విధానం, కార్యకలాపాలు సరిగా లేవని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకురావడాన్ని సినీనటుడు ప్రకాశ్‌రాజ్ స

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు.. అపెక్స్ కోర్టు పని విధానం, కార్యకలాపాలు సరిగా లేవని నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా ముందుకురావడాన్ని సినీనటుడు ప్రకాశ్‌రాజ్ సమర్థించారు. వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. "కొందరు ఆత్మవంచన చేసుకోరు. జడ్జి లోయా కేసు నుంచి ఆధార్ కేసు వరకు కేంద్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నా నోరు మూర్చుకొని కూర్చోరు" అని ట్వీట్ చేశారు.
 
రెండు రోజుల క్రితం దేశంలోనే తొలిసారి నలుగురు సుప్రీం న్యాయమూర్తులు మీడియా సమావేశం పెట్టిమరీ... సుప్రీంకోర్టు సరైన దారిలో నడవడం లేదని, ఈ విషయాన్ని తాము చూసి చూడనట్లు వ్యవహరించలేమని, దేశ భవిష్యత్ దృష్యా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నామని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలను స్వాగతించిన ప్రకాష్ రాజ్, ప్రతి ఒక్కరూ ఇలాగే దేశ ప్రయోజనాలను కాపాడేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.