శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (14:51 IST)

మోడీజీ... 150+ అన్నారు.. ఎక్కడ : ప్రకాష్ రాజ్ ప్రశ్న

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ ప్రశ్న సంధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150+ సీట్లలో గెలుపొందుతుందనీ ఢంకాబజాయించారు. మరి ఇపుడు 150 సీట్లు ఎక్కడ అంటూ ప్రశ్నించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఓ ప్రశ్న సంధించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 150+ సీట్లలో గెలుపొందుతుందనీ  ఢంకాబజాయించారు. మరి ఇపుడు 150 సీట్లు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. గుజరాత్ అసెంబ్లీ ఫలితాలపై ప్రకాష్ రాజ్ 'జస్ట్ ఆస్కింగ్' అంటూ సోమవారం ఓ పోస్ట్ చేశారు. 
 
'ప్రియ‌మైన ప్రధాన‌మంత్రిగారూ.. విజ‌యం సాధించినందుకు అభినంద‌న‌లు. కానీ, ఈ ఫ‌లితాల‌తో నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? 150 ప్ల‌స్ సీట్లు సాధిస్తామ‌న్నారు క‌దా.. ఏమైంది? ఒక‌సారి సింహావ‌లోక‌నం చేసుకోండి. స‌మ‌స్య‌లు ఎక్క‌డున్నాయో తెలుసుకోండి. విభ‌జ‌న రాజ‌కీయాలు ప‌నిచేయ‌లేదు. గ్రామీణుల‌ను, పేద‌ల‌ను, రైతుల‌ను నిర్ల‌క్ష్యం చేశారు. వారి గొంతు బిగ్గ‌ర‌గా వినిపిస్తోంది.. మీరు వింటున్నారా' అని ప్ర‌కాశ్ రాజ్ ట్వీట్ చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా ప‌లు అంశాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని ప్రకాష్ రాజ్ ప్ర‌శ్నిస్తున్న విషయం తెల్సిందే.