బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (22:20 IST)

సైనా నెహ‌వాల్ సినిమా వ‌చ్చేస్తుంది!

saina poster
బ‌యోపిక్‌ల ప‌ర్వంలో బ్యాడ్మింటన్ సైనా నెహ‌వాల్ సినిమా వ‌చ్చేస్తుంది. చాలాకాలంగా సైనా పేరుతో సినిమా రూపొందుతోదంటూ ప్ర‌చారం జ‌రిగింది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో సైనా పాత్ర‌ను శ్ర‌ధ్దా క‌పూర్ చేస్తున్న‌ట్లు కూడా వ‌చ్చింది. త‌ర్వాత సినిమా ఆగిపోయింది. ఆ త‌ర్వాత మ‌ర‌లా షూట్ మొద‌లైంది. ఇప్పుడు ష‌డెన్‌గా సైనా విడుద‌ల‌కు సిద్ధ‌మైందంటూ నిర్మాణ సంస్థ సోష‌ల్‌మీడియాలో పెట్టింది. టీసిరీస్‌, ఫ్రంట్ ఫూట్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న  ఈ సినిమాలో సైనా పాత్ర‌ను ప‌రిణితి చోప్రా న‌టించింది. హిందీ, తెలుగు భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కాబోతుంది. అమోల్ గుప్త దీనికి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకు న‌లుగురు నిర్మాత‌లు. క‌రోనా స‌మ‌యంలో ఈ సినిమా విడుద‌ల‌కావాల్సింది. కానీ ఆ సినిమాను అప్ప‌టికి వాయిదా వేశారు. పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్తికాలేదు. ఎట్ట‌కేల‌కు మార్చి 26న సినిమా విడుద‌ల‌కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ బ‌యోపిక్‌లో ఆమె గురువు గోపీచంద్ పాత్ర‌కూడా వుంటుంద‌ని తెలుస్తోంది.