గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి

సైనా నెహ్వాల్‌కు కరోనా రిపోర్ట్‌లో గందరగోళం.. నెగటివ్ అని..?

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు కరోనా సోకిందని వార్తలు వచ్చాయి. మాజీ ప్రపంచ నెం-1 అయిన సైనా నెహ్వాల్ థాయ్‌లాండ్ ఓపెన్ 2021లో పాల్గొనేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆ టోర్నీకి ముందు చేసిన కరోనా పరీక్షలో సైనాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. అయితే ఈ టోర్నీకి వెళ్లిన సైనా తన భర్త సహచర ఆటగాడు అయిన పారుపల్లి కశ్యప్ తో కలిసి ఒకే గదిలో ఉండటంతో అతడిని కూడా క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. 
 
కానీ తాజా సమాచారం ప్రకారం సైనా నెహ్వాల్ కు కరోనా లేదని రిపోర్ట్‌లో గందరగోళం జరిగింది అని బిడబ్ల్యుఎఫ్ ప్రకటించింది. నెహ్వాల్‌తో పాటుగా కరోనా పాజిటివ్‌గా పరీక్షించబడిన మరో ఆటగాడు హెచ్.ఎస్.ప్రణయ్ కూడా కరోనా సోకలేదని తెలిపింది. దాంతో సైనా, కశ్యప్, ప్రణయ్ తిరిగి థాయ్‌లాండ్ ఓపెన్ లో పాల్గొననున్నారు. సోమవారం రద్దు చేసిన వీరి మ్యాచ్‌లను బుధవారం నిర్వహించనున్నారు.