సైనా నెహ్వాల్‌కు కోవిడ్ 19, క్వారెంటైన్‌లో వున్న షట్లర్

Saina Nehwal
ఐవీఆర్| Last Updated: మంగళవారం, 12 జనవరి 2021 (13:29 IST)
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో హోమ్ క్వారెంటైన్లో వున్న క్రీడాకారులు సైనా నెహ్వాల్, ప్రణయ్‌లకు జరిగిన మూడవ కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. థాయ్‌లాండ్ ఓపెన్ 2021లో పాల్గొన్న షట్లర్లు ఇద్దరూ తదుపరి పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పారుపల్లి కశ్యప్ వీరికి క్లోజ్ కాంటాక్టులో వుండటంతో అతడికి కూడా పరీక్షలు చేసారు. రిజల్ట్ రావలసి వుంది.

దాదాపు 300 రోజుల విరామం తర్వాత ఒలింపిక్స్‌కు ముందే ఆట తిరిగి ప్రారంభమైనందున భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు బ్యాంకాక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి పరీక్షలు చేయగా కరోనా అని తేలింది. కాగా ఆమధ్య టి-20 క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన క్రికెటర్లు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
దీనిపై మరింత చదవండి :