సైనా నెహ్వాల్: భారతీయ జనతా పార్టీలో చేరిన బ్యాడ్మింటన్ స్టార్
ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆమెతో పాటు ఆమె సోదరి సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ సైనా నెహ్వాల్, ఆమె అక్క చంద్రాన్షు నెహ్వాల్‌లకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి, కాషాయ కండువా కప్పారు.
ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. దేశం కోసం కష్టపడుతున్న పార్టీ బీజేపీ అని, అలాంటి పార్టీలో చేరటం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. తాను కష్టపడే స్వభవం గల వ్యక్తినని, కష్టపడేవాళ్లంటే తనకు ఇష్టమని.. నరేంద్ర మోదీ దేశం కోసం రాత్రి, పగలు కష్టపడుతుంటారని, ఆయనతో పాటుగా తాను కూడా దేశం కోసం కష్టపడతానని తెలిపారు.
తనకు రాజకీయం కొత్త అని, అయితే.. రాజకీయాలపైన కూడా అవగాహన తెచ్చుకోవడం, రాజకీయాలను పరిశీలించడం తనకు నచ్చుతుందని చెప్పారు.