బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (17:51 IST)

యశోద సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటాను.. సమంత ఫోటో వైరల్

Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటోంది. ఆమె కోలుకోవాలని ఆమె ఫ్యాన్సుతో పాటు పలువులు ప్రార్థిస్తూ.. ఓదార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సమంత నెట్టింట షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 
''జీవితంలో ఏరోజు ఎలా ఉన్నా.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా.. మనం వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. మన ధైర్యం ఏమిటో నిరూపించుకోవాలి' అని నాకు మా స్నేహితులు చెప్పారు. ఆ మాటలను నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నా అందుకే నవంబర్‌ 11న మీ ముందుకు రానున్న యశోద సినిమా ప్రమోషన్స్‌లో నేను పాల్గొంటా" అని సమంత పేర్కొంది. ఆరోగ్యం బాగాలేకపోయినా సినిమా కోసం కష్టపడుతున్న సామ్‌పై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 
 
మరోవైపు యశోద చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం యశోదలోని ప్రధాన తారాగణంతో ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఈ ప్రమోషన్స్‌లో సమంత పాల్గొననుందనే వార్త ఆమె ఫ్యాన్సును ఖుషీ చేస్తోంది.