శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మార్చి 2023 (16:45 IST)

పుట్టుకతోనే సూపర్ స్టార్ - అల్లు అర్హపై సమంత కామెంట్స్

allu arha
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ సినీ రంగ ప్రవేశం చేసింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం చిత్రం ద్వారా ఆమె బాలనటిగా పరిచయమవుతున్నారు. ఇందులో అల్లు అర్హ నటనపై సమంత స్పందించారు. ఈ నెల14వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే సమంత పలు ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాజాగా అల్లు అర్హ గురించి మాట్లాడింది.
 
'అల్లు అర్హ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడగలదు. ఈ విషయంలో తన తల్లిదండ్రులను అభినందించాలి. ఎంత పెద్ద డైలాగైనా చాలా తేలికగా చెప్పేస్తుంది. తన సీన్‌ వచ్చినప్పుడల్లా ముచ్చటేసి నాకు తెలియకుండానే నవ్వుకునే దాన్ని. మొదటి రోజు షూటింగ్‌లో సుమారు 100 మంది చైల్డ్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అంతమందిలో కూడా అర్హ ఎలాంటి భయం లేకుండా తన డైలాగును ధైర్యంగా చెప్పింది. అర్హకు నటనలో శిక్షణ అవసరం లేదు. తను పుట్టుకతోనే సూపర్‌ స్టార్‌' అంటూ అర్హ నటనపై సమంత ప్రశంసలు కురిపించింది.
 
కాగా, గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం' సినిమా కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం ఐదు భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. మోహన్‌బాబు, గౌతమి, ప్రకాష్‌ రాజ్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు అల్లు అర్హ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.