ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 డిశెంబరు 2022 (10:52 IST)

శ్రేయా ఘోషల్ పాటకు స్టెప్పులేసిన సుధామూర్తి డ్యాన్స్

Sudha Murty
Sudha Murty
బాలీవుడ్ సింగర్ శ్రేయా ఘోషల్ హిందీ పాట పాడుతుంటే ఇన్ఫోసిస్ సంస్థ ఛైర్ పర్సన్ సుధామూర్తి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. శ్రేయా, సుధామూర్తి కోసం డైరక్టర్ మణిరత్నం తెరకెక్కించిన గురు సినిమాలోని బర్సో రే మేఘా మేఘా పాట పాడింది. 
 
ఈ పాట సుధాకు ఫేవరేట్ కావడంతో డ్యాన్స్ చేస్తుంటే.. పక్కన వున్నవాళ్లు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య అయిన సుధామూర్తి రచయితగా, సామాజిక స్పృహ వున్న వ్యక్తి చాలా పాపులర్. ఈమె వైజ్ అండ్ అదర్ వైజ్ వంటి పుస్తకాలు రాశారు. ఇంకా అనాధ ఆశ్రమాలను కూడా నెలకొల్పారు.