గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 16 మే 2023 (17:11 IST)

స్పై చిత్రం సుభాష్‌చంద్రబోస్‌ బయోపిక్ కాదు: నిఖిల్

Nikhil
Nikhil
నిఖిల్ సిద్ధార్థ రా ఏజెంట్ గా నటిస్తున్న చిత్రం స్పై. గ్యారీ బిహెచ్  డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సి.ఇ.ఓ. చరణ్‌తేజ్‌ నిర్మిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ పై ఈ చిత్రం ఉంటుందని ముందే చెప్పేసారు. అందుకే నిన్న న్యూఢిల్లీలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద స్పై’ టీజర్ విడుదల చేసారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి 3 మిలిన్ వ్యూస్ కు చేరుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందం వెలిబుచ్చారు. అందుకే మంగళవారం నాడు హైదరాబాద్ లో విలేకరులకు స్పై’ టీజర్ చూపించి స్పై ఫస్ట్‌మిషన్‌ పేరుతో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌. మాట్లాడుతూ, ఈ సినిమాకు నన్ను మొదట ఎడిటర్‌గా తీసుకున్నారు. ఏమైందోకానీ ఆ తర్వాత నువ్వే డైరెక్టర్‌ అన్నారు. చేయాలా వద్దా! అనే డైల్‌మాలో వున్నాను. నా డెబ్యూ సినిమా నిఖిల్‌తో చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆ తర్వాత తెలిసింది ఏమంటే నిఖిల్‌గారే మిమ్మల్ని డైరెక్ట్‌ చేయమన్నారని టీమ్‌ చెప్పడంతో మరో ఆలోచన లేకుండా చేసేశాను. యాక్షన్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ కోసం ఏడాదిన్నరపాటు పనిచేశాం. వైజాగ్‌లోని నా ఫ్రెండ్‌తో కలిసి టీమ్‌గా ఏర్పడి చేసిన సినిమా స్పై. ప్రతివారూ తమ టాలెంట్‌ను చూపించారు. ఎడిటర్‌గా నేను చాలా సినిమాలకు టీజర్‌ కట్‌ చేశాను కానీ ఈ సినిమాకు టీజర్ 
అంటేనే కొంచెం టెన్షన్‌ పడ్డా. విశాల్‌ చంద్రశేఖర్‌ సమయం తక్కువగా వున్న మంచి ఔట్‌పుట్‌ ఇచ్చారు. అనిరుద్‌ ఈ స్క్రిప్ట్‌ కోసం చాలా వర్షన్‌లు రాశాడు. హీరో నిఖిల్‌తో పనిచేయడం గొప్పగా వుంది. సాన్య, ఐశ్వర్య లీడ్‌ రోల్స్‌ చేశారు. స్పై మూవీ కాట్టి యాక్షన్‌ పరంగా బాగా కష్టపడ్డారు. నిఖిల్‌ లేకపోతే నేను లేను. జూన్‌ 29న సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. ఆశీర్వదించండి అన్నారు.
 
హీరో నిఖిల్‌ సిద్దార్త్‌ మాట్లాడుతూ, స్పై ఫస్ట్‌మిషన్‌ అని పెట్టడానికి కారణం మీడియాతో ఇంట్రాక్ట్‌ అవడం కోసమే. ఎన్ని హిట్లు వచ్చినా ప్రతి సినిమా కొత్త ప్రయత్నమే. స్పై మూవీకి హీరో కథనే. ఈ మధ్య ప్రజలు ఇష్టపడేది మంచి కథనే. హీరో, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంత వున్నా కథ అనే సోల్‌ లేకపోతే బ్లాక్‌ బస్టర్‌అవ్వదు. అలాంటి కథను రాజశేఖర్‌రెడ్డిగారు ఇచ్చారు. మొదట కథ విని నో చెబుదాం అనుకున్నా. కానీ ఆయన చెప్పిన విధానం చూసి చేసేద్దాం అనిపించింది.
ఈ కథ ఏమిటనేది తెలిసిందే. సుభాష్‌చంద్రబోస్‌ గారి గురించి చాలా విషయాలు మనకు తెలియవు. ఆయన స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దాని పనులు చాలామందికి తెలీవు. ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు దేశానికి తెలియాల్సిన పాయింట్‌ ఇందులో వుంది. నిన్న ఢిల్లీలో విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నేతాజీగారి సీక్రెట్స్‌ ఈ కథ. తేజ్‌ నిర్మాతగా బాగా ఖర్చుపెట్టారు. ఇతర నటీనటులు అందరూ బాగా నటించారు.  
సుభాష్ చంద్రబోస్ వంటి దేశ భక్తుడి కథ తో సినిమా చేయడం గౌరవంగా భావిస్తామని అన్నారు. దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది గురించి తెలియదు. అవన్నీ వెలికి తీశాం అన్నారు.  సుభాష్ చంద్రబోస్ బయోపిక్ కాదు. దేశ భక్తి కథ అని అన్నారు.