ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 28 మే 2018 (11:47 IST)

సైరా సినిమాలో తమన్నా భరతనాట్యం...

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' సినిమా రూపొందుతోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా కావడం వలన వివిధ భాషల్లో సైరా సినిమాను విడుదల చేయాలనే ఆలోచన ఉండటం వలన నటీనటుల ఎంపిక విషయంలో

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' సినిమా రూపొందుతోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన సినిమా కావడం వలన వివిధ భాషల్లో సైరా సినిమాను విడుదల చేయాలనే ఆలోచన ఉండటం వలన నటీనటుల ఎంపిక విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రకోసం తమన్నాను తీసుకున్నారు.
 
ఈ సినిమాలో తమన్నా నరసింహా రెడ్డి కోసం ప్రాణత్యాగం చేసే వీరనారిగా కనిపించనున్నదని సమాచారం. ఈ సినిమాకోసం కొంతకాలంగా తమన్నా భరతనాట్యం నేర్చుకుంటోంది. ఒక వైపున వీరనారి అనే ప్రచారం మరో వైపున భరతనాట్యం నేర్చుకుంటోందనే వార్త తమన్నా పాత్ర విషయంలో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాలో ఆమె పాత్రను చూపించే ప్రభావం ఎలా ఉంటుదన్న విషయం గురించే ఫిల్మ్ నగర్లో మాట్లాడుకుంటున్నారు. మెుత్తానికి సైరాలో తమన్నా కొత్తగా కనిపించనున్నది.