గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (10:44 IST)

సూర్య 43: దుల్కర్ సల్మాన్‌తో పాటు నజ్రియా, ఫహద్ జంటగా నటిస్తారా?

Suriya 43
Suriya 43
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 43వ చిత్రాన్ని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. "ఆకాశమే నీ హద్దురా" దర్శకురాలు సుధా కొంగరతో మళ్లీ జోడీ కడుతున్నారు. దుల్కర్ సల్మాన్ మరో కథానాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రాన్ని సూర్య తన బ్యానర్‌పై నిర్మించనున్నారు.
 
"పుష్ప"లో విలన్‌గా నటించిన ఫహద్ ఫాసిల్, అతని భార్య, నటి నజ్రియా ఇందులో ప్రధాన కథానాయికగా నటించనున్నారు. చాలా కాలం తర్వాత నజ్రియా, ఫహద్‌లు కలిసి ఈ చిత్రంలో  నటిస్తున్నారు.. కానీ జంటగా కాదు. 
 
ఈ సినిమా సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్‌కి 100వ ప్రాజెక్ట్. ఇది 1970లలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా. సుధా కొంగర ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.