ఎస్.ఎస్.ఎం.బి.28 చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి
సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా సినిమా ఎస్.ఎస్.ఎం.బి.28 . ఇటీవలే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తొలిరోజు షూట్ హాజరయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ షెడ్యూల్ నేటితో ముగిసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ తొలి షెడ్యూల్‌లో పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్స్ అన్బారివు ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశారు. దసరానుంచి తదుపరిషెడ్యూల్ జరగనున్నదని తెలిపారు.
కాగా, ఈ సినిమాలో నాయికగా పూజా హెగ్దే నటించనుంది. ఇప్పటికే మహేస్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే మంచి హైప్ ఏర్పడింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల సినిమాను త్వరగా పూర్తిచేయాలని యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోవిడ్ వల్ల కథలలో గందరగోళం ఏర్పడింది. అందుకే ఇప్పుడు చక్కటి కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.