గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 సెప్టెంబరు 2022 (15:45 IST)

"ఖలేజా" వీడియోతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్

డేవిడ్ వార్నర్ టిక్ టాక్ వీడియోలకు పెట్టింది పేరు. ట్రెండింగ్ అనుగుణంగా వీడియోలతో ఎంటర్‌టైన్ చేస్తాడు. ఇప్పటికే ఈ టిక్ టాక్ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దక్షిణాది స్టార్లకు సంబంధించిన ట్రెండింగ్‌ వీడియోలను ఇతను అనుకరిస్తాడు. 
 
కొద్ది రోజులుగా టిక్ టాక్ వీడియోలకు బ్రేక్ ఇచ్చిన.. గ్యాప్ తర్వాత మళ్లీ స్టార్ట్ చేశాడు. ఇందులో భాగంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన ఓ పాపులర్ సీన్‌ను స్పూఫ్ చేశాడు. 
 
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన ఖలేజా సినిమాలోని ఓ సన్నివేశాన్ని తన ఫేస్‌తో మార్ఫింగ్ చేసి నేనేవరో చెప్పుకోండి? అని ప్రశ్నించాడు. ఈ వీడియోను చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ .. వార్నర్ బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు.