శనివారం, 12 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 నవంబరు 2022 (08:26 IST)

ఆదిపురుష్ విడుదల తేదీ 16 జూన్, 2023 అని ప్రకటించిన నిర్మాతలు

aadipurush date poster
aadipurush date poster
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ నిర్మాతలు ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఆదిపురుష్ ఇప్పుడు 16 జూన్, 2023న విడుదల కానుంది. సోమవారంనాడుఈ విషయాన్ని సోషల్ మీడియాలో దర్శకుడు, నిర్మాతలు ప్రకటించారు. ప్రభాస్ ఆదిపురుష్తో పాటు ప్రాజెక్ట్-కె’, ‘రాజా డీలక్స్’ సినిమాలను చేస్తున్నాడు.  ఫిలిం సిటీలో ప్రాజెక్ట్-కె షూటింగ్ జరుగుతుంది. మరోవైఫు ఆదిపురుష్ కూడా జరుగుతుంది.
 
కానీ., ఆదిపురుష్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉండటంతో సినిమా వాయిదా పడే సూచలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. కాగా, మళ్లీ వాయిదా వళ్ళ భారం రూ.100 కోట్లు పడనున్నదని వార్తలు కూడా వస్తున్నాయి. ‘ఆదిపురుష్’ కు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్‌అలీ ఖాన్ నటించారు. కొన్ని రోజుల క్రితమే అయోధ్యలో సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్‌ ఆశించిన స్థాయిలో లేవని అనేక మంది నెటిజన్స్ తెలిపారు. అందువల్ల సంక్రాంతికి విడుదల కావాల్సి చిత్రాన్ని వాయిదా వేశారు. వానాకాలం కానుకగా విడుదల చేయాలనుకున్నారు.