శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 నవంబరు 2022 (13:21 IST)

తమన్నాకు చెస్ నేర్పిస్తున్న ప్రభాస్.. వీడియో వైరల్

prabhas_Tamannah
prabhas_Tamannah
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో నటిస్తూ బిజీబిజీగా వున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలలో నటిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా తమన్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 
 
కాగా ప్రస్తుతం తమన్నా చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో నటిస్తోంది. అలాగే ఆమె నటించిన బాలీవుడ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 
 
ఒకవైపు ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. మరోవైపు తమన్నా భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. 
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ఇప్పటిది కాదు రెబల్ సినిమా సమయంలోది. 
 
సినిమాలో ఒక షూటింగ్ గ్యాప్‌లో తమన్నా ప్రభాస్ ఇద్దరు చదరంగం ఆట ఆడారు. ఈ క్రమంలోనే తమన్నాకి ప్రభాస్ చెస్ ఎలా అని ఆడాలో నేర్పుతున్నారు. 
 
ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ బిహైండ్ ద సీన్స్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఒకరు ఆ వీడియోని అప్లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది.