గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (16:50 IST)

హరి హర వీర‌మ‌ల్లు షూట్‌లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan
Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తాజాచిత్రం హరి హర వీరమల్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా నివేదిక ప్ర‌కారం బుధ‌వారంనాడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్  ప్రారంభమైంది. తొలి స‌న్నివేశాల్లో ప‌వ‌న్ పాల్గొన్న‌ట్లు తెలిసింది. గ‌తంలో జ‌రిగిన షూట్ కొంత యాక్ష‌న్ పార్ట్ చిత్రీక‌రించారు. ఇప్పుడు దానికి కొన‌సాగింపుగా కొన్ని షాట్స్ తీస్గున్న‌ట్లు స‌మాచారం.
 
కాగా, కొద్దిరోజుల‌పాటు అక్క‌డే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. నిధి అగర్వాల్ కథానాయికగా న‌టిస్తోంది. ఆమెపైన కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు.  జాగ‌ర్ల మూడి రాధాకృష్ణ‌, క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర క‌థ‌ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.  ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప‌వ‌న్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రంగా ఇది రూపొందుతోంది. ఎ.ఎం. ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.