శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (18:16 IST)

సోనూసూద్ కీల‌క నిర్ణ‌యం ఇదే!

Sonu Sood time
బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఓ కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకోనున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న క‌రోనా బారిని ప‌డిన బాధితుల‌ను ఆదుకోవ‌డ‌మే కాకుండా, చాలా రాష్ట్రాల‌లో వ‌ల‌స కూలీల‌ను వారి వారి గ‌మ్య స్థానాల‌కు తీసుకువెళ్ళారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో మ‌రింత ముందుకు వ‌చ్చి సేవ చేశారు. ఆక్సిజ‌న్ క్యూరేట‌ర్ల‌ను సిలెండ‌ర్ల‌ను అవ‌స‌ర‌మైన వారికి అంద‌జేయ‌డం జ‌రిగింది.
 
రియల్ హీరో సోనూసూద్ అనిపించుకున్నారు. తాజాగా తన సొంత ఖర్చులతో కరోనా రోగుల కోసం సిద్దిపేటలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. సిద్దిపేటలో ఆక్సిజన్ ప్లాంట్ కు అనుమతి కావాలని మంత్రి హరీష్ రావు గారిని సర్పంచ్ ల సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆలేటి రజిత యాదగిరి కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండెగొని రంజిత్, దండుగుల స్వామి, ప్రవీణ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఈరోజు రాత్రి 7.02 నిముషాల‌కు త‌న సేవ‌ల‌ను పాన్ ఇండియా లెవ‌ల్‌లో విస్త‌రించ‌డానికి నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ  స‌మాచారం. అది ఏమిటీ? ఎలా? అనేది వెబ్‌దునియా కొద్ది సేప‌టిలో వెల్ల‌డించ‌నుంది.