సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (11:09 IST)

బుల్లితెరకు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న ఉదయభాను..

Udayabhanu
బుల్లితెరకు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది ఉదయభాను. జీ తెలుగులో ప్రసారం కానున్న "సూపర్ జోడీ" అనే డ్యాన్స్ ప్రోగ్రాంకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను జీతెలుగు విడుదల చేసింది. 
 
ఈ నెల 28 నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభం అవుతుందని, గోల్డెన్ లేడీ ఉదయభాను ప్రోమో అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ షో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. 
 
ఈ వీడియోలో ఉదయభాను తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.."ఆ పొద్దు అమ్మా" అని తన పిల్లలు చెప్పడంతో సూపర్ జోడీ ప్రోగ్రాంతో యాంకర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వెల్లడించింది. 
 
సూపర్ జోడీ ప్రోగ్రాంకు సీనియర్ నటి మీనా జడ్జిగా వ్యవహరిస్తున్నట్టు చెప్తూ మరో వీడియోను కూడా జీ తెలుగు విడుదల చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు ఇంట్లో పనితోనే సరిపోతుందని, సండే కూడా ఫన్ లేదంటూ ఆ వీడియోలో మీనా విచారం వ్యక్తం చేస్తుంది.