ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 2 మే 2022 (14:11 IST)

వృద్ధ మ‌హిళ‌ల ఆశీస్సులు పొందిన ఉపాస‌న‌

Upasana with oldagers
Upasana with oldagers
రామ్‌చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కొణిదెల త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత ఉదృతం చేసింది. అపోలో ఆసుప్ర‌తి డైరెక్ట‌ర్‌ల‌లో ఒక‌రైన ఉపాస‌న త‌న తండ్రి, తాత ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు ముందుకు సాగ‌తుతుంది. క‌రోనా స‌మ‌యంలో సినిమారంగానికి చెందిన వారినేకాకుండా బ‌య‌ట వారికి కూడా ఉచితంగా టీకాలు వేయించారు .అదేవిధంగా ప‌లువిధాలుగా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.
 
Upasana with his team
Upasana with his team
ఇక సోమ‌వారంనాడు బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా 150కి పైగా వృద్ధాశ్రమాలకు ఆమె మద్దతునిస్తున్నారు. ఆప‌రేష‌న్ త‌ర్వాత వారు తీసుకునే ఆహార విష‌యాల‌లోనూ ఆమె సాయం చేశారు. ఈ సంద‌ర్భంగా వారితో కాసేపు గ‌డిపి చాలా విష‌యాలు తెలుసుకున్నారు. ప‌లువురు వృద్ధులు ఆమెను దేవ‌త‌గా పోల్చారు. పుట్టినింటికే కాకుండా మెట్టినింటికి మంచి పేరు తెచ్చే మ‌హిళా ఎదిగామ‌ని మిమ్మ‌ల్ని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని వారు పేర్కొన్నారు. వారి ఆప్యాయ‌త‌కు ఉపాస‌న ముగ్థుల‌య్యారు.