గురువారం, 7 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (15:32 IST)

నేనిక్కడే వుంటా రమ్మను అంటున్న సైంథవ్‌ (video)

Venkatesh-saidhav
Venkatesh-saidhav
వెంకటేష్‌ తాజా సినిమాకు సైంథవ్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్‌ను ఈరోజు విడుదల చేశారు. దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా వెంకటేష్‌కు 75వ సినిమా. నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందుతోంది. ఇందులో వెంకటేష్  నడచుకుంటూ బైక్‌ దగ్గరకు వస్తాడు. అక్కడ సీటుపై బాక్స్‌లో ఐస్‌లో వున్న ఓ ఇంజక్షన్‌ లాంటిది తీసి పట్టుకుని నడుచుకుంటూ వెళతాడు. ఒకచేత్తో గన్‌ కూడా వుంటుంది. అలా నడుచుకుంటూ వచ్చి ‘నేను ఇక్కడే వుంటాను. ఎక్కడికి వెళ్ళను. రమ్మను..’ అంటూ పలికే డైలాగ్‌తో ఎండ్‌ అవుతుంది. అతని ఎదురుగా కొందరు చనిపోయి వుంటారు. 
 
ఇలా సరికొత్తగా వున్న ఈ గ్లింప్‌ వెంకటేష్‌తో చేసిన యాక్షన్‌ సినిమాగా కనిపిస్తుంది. ఈ సినిమా ఈనెల 26నుంచి షూటింగ్‌ కంటెన్యూగా సాగనుంది. వెంకటేష్‌కు పాన్‌ ఇండియా సినిమాగా వుండబోతోంది. ఐదు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.