గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (17:02 IST)

ఖుషి రీ-రిలీజ్.. పవన్ సినిమాను చూసిన అకీరా నందన్ (video)

Kushi
టాలీవుడ్‌లో కొంతకాలంగా రీ-రిలీజ్‌లు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదల కాగా, తాజాగా టాలీవుడ్ పవర్‌ స్టార్  పవన్ కల్యాణ్ ఖుషి సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
కుషి రీ రిలీజ్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు భారీ స్థాయిలో థియేటర్లకు చేరారు. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాకు ఎస్‌జె సూర్య దర్శకత్వం వహించారు. భూమిక కథానాయిక. దాదాపు 21 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం శనివారం విడుదలైంది. ప్రేక్షకులకు 4K నాణ్యత, 5.1 డాల్బీ ఆడియోతో "ఖుషి"ని మళ్లీ రిలీజ్ చేసింది చిత్ర బృందం. 
 
ఈ నేపథ్యంలో ఖుషి సినిమాను పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హైదరాబాద్ దేవి 70 ఎంఎం థియేటర్‌లో వీక్షించారు. ప్రస్తుతం అకీరా ఖుషీ రీ రిలీజ్ సినిమాను వీక్షించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.