శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (10:32 IST)

'కరోనా'పై ఎన్టీఆర్ పాట రీమిక్స్... కీరవాణి టాలెంట్ అదుర్స్ (వీడియో)

తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన టాలెంట్ ఉన్న సంగీత దర్శకుల్లో ఎంఎం కీరవాణి ఒకరు. ఈయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీత బాణీలను సమకూర్చారు. పైగా, సమయం సందర్భానికి అనుగుణంగా లిరిక్స్ రాసి, దానికి ట్యూన్ చేసి, పాడగల పావీణ్యం ఆయన సొంతం. 
 
తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఓ పాట రాశారు. దీనికి జూనియర్ ఎన్టీఆర్ నటించిన "స్టూడెంట్ నంబర్ 1" చిత్రంలోని ఓ పాట ట్యూన్‌లో రిమిక్స్ చశారు. ఈ పాట 'ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి' అనే పాట ఎంత సూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
ఇపుడు ఇదే ట్యూన్‌లో కీరవాణి ఓ పాట పాడారు. 'ఎక్క‌డో పుట్టి.. ఎక్కడో పెరిగి..' అనే పాట సాహిత్యం మార్చి "ఎక్క‌డో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్క‌డే చేరింది.. మ‌హ‌మ్మారి రోగ‌మొక్క‌టి" అని త‌న‌దైన శైలిలో పాట రూపొందించారు. 
 
ప్ర‌స్తుతం ఈ పాట నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించేలా ప‌లు కార్య‌క్ర‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే.