ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (19:19 IST)

జానీ మాస్టర్ కి జరిగింది రేపు వారికీ జరుగుద్ది : సుహాసిని కామెంట్

Johnny Master's wife Suhasini
Johnny Master's wife Suhasini
కొన్ని ఛానల్స్ అయితే జానీమాస్టర్ భార్యే అమ్మాయిలను పంపుతుంది అని రాశారు. ఎంత దారుణం. బహుశా అలా చెబుతున్న వారు వారి భార్యలను అలా పంపుతారేమోనని జానీ మాస్టర్ భార్య సుహాసిని ఘాటుగా వ్యాఖ్యానింది. 

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కెరీర్ ను నాశనం చేసిన అతని అసిస్టెంట్ స్రషి వర్మ కెరీర్ కూడా త్వరలో నాశనం అవుతుంది. ఈరోజు ఆమెకు ఎవరైతే అండగా వున్నారో రేపు వారిపైనే రేప్ కేసుపెడుతుందని జానీ మాస్టర్ భార్య సుహాసిని స్పష్టం చేసింది. ఆమెను కొందరు పావులా వాడుకుంటున్నారు. ఇది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా ఆమె చేయగలిగేది ఏమీ లేదని ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జానీ మాస్టర్ భార్య సుహాసిని పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
 
- ఢి జోడి షోలో స్రష్టి వర్మ పాల్గొంది. జోడి అంటే 18 ఏళ్ళు వున్నవారినే తీసుకుంటారు. మరి 16 సంవత్సరాలు అని ఎందుకు చెప్పింది. షో కోసం తప్పుడు సర్టిఫికెట్ తెచ్చింది. లేదా రెండేళ్ళ నాడే ఆమె బయట రేప్ కు గురయిందా?. ఆ రేప్ ఎవరు చేశారు? అప్పటికీ జానీ మాస్టర్ పరిచయమే లేదు. ఓరిస్సా అవతల నుంచి వచ్చిన ఆమె ఇక్కడ జానీమాస్టర్ తో సమానంగా షూటింగ్ లకు ట్రావెల్ అవుతూ, మాస్టర్ కు ఇచ్చే రాచమర్యాదలు, గౌరవం పట్ల ఆకర్షితురాలై ఇలాంటి పోకడలకు పోయిందని నాకు అర్థమైంది.
 
- నెల్లూరు నుంచి స్వశక్తితో ఎదిగిన జానీ మాస్టర్ శైలి సెపరేట్ గా వుంటుంది. ఎవరినీ లెక్కచేయని తనంలా కనిపిస్తాడు. కానీ చాలా మంచి వ్యక్తి. 14 ఏళ్ళపాటు నేను కాపురం చేసి చెబుతున్నా. చాలా  సార్లు మా ఇంటికి స్రష్టివర్మ వచ్చింది. అన్నయ్య అనిపిలిచేది. గురువుగారు మరోసారి అనేది. కానీ మాకు అనుమానం రాకుండా ప్రవర్తించేది.
 
- పుష్ప 2 లో అసలు గొడవ జరిగిందని అంటున్నారు. నాకైతే తెలియదు. సినిమా రంగానికి చెందిన ఇద్దరు పెద్దలు ఈ గొడవ వెనుక వుంది నడిపిస్తున్నారని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే జానీ మాస్టర్ ఇష్యూ వారి జీవితాల్లో కూడా తప్పకుండా జరుగుతుంది. అప్పుడు స్రష్టి వర్మ జీరో అవుతుంది.
 
- జానీ మాస్టర్ ఎదుగుదల చాలా మందికి కంటగింపుగా వుంది. జాతీయ స్థాయిలో అవార్డు వచ్చాక ఆయనంటే పడని వ్యక్తులు అవకాశం కోసం కాచుకుని చూస్తున్నారు. డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన పదవిని దక్కించుకోవాలని చాలామంది చూస్తున్నారు. వారి ప్రమేయం వుందని నేనయితే అనుకోవడంలేదు.