మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 మార్చి 2023 (09:56 IST)

కడుపుతో వున్నానని తెలియదు.. అలా అబార్షన్ అయ్యింది - స్మృతి ఇరానీ

Smriti Irani
Smriti Irani
భాజపా నేత, సినీ నటి స్మృతి ఇరానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను గురించి వివరించారు. సీరియల్ షూటింగ్ టైమ్‌లో  తాను ప్రెగ్నెంట్ అయ్యానని.. అయితే ఆ విషయం తెలియదని చెప్పింది. షూటింగ్‌లో నీరసంగా అనిపించడంతో ఓపిక లేదని ఇంటికి వెళ్లిపోతానని అడిగాను. కానీ వర్క్ ఎక్కువగా వుండటం వల్ల చేసేది లేక సాయంత్రం వరకూ సెట్ లోనే వుండిపోయాను. 
 
ఆ రోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లగా అబార్షన్ అయినట్లు తెలిసింది. దీంతో షాకయ్యాను. అబార్షన్ అయ్యిందని చెప్పినా నమ్మలేదు. ఓ వ్యక్తి వదంతులు పుట్టించాడు. అలాంటి సమయంలో తాను చెప్పింది నిజమేనని నమ్మించడం కోసం రిపోర్టు తీసుకెళ్లి.. ఆ ప్రోగ్రామ్ క్రియేటర్ ఏక్తా కపూర్‌కి చూపించానని స్మృతి ఇరానీ తెలిపారు. 
 
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు రూ.1800ల జీతం. వివాహం సమయంలో 30వేల రూపాయలకు పెరిగిందని చెప్పారు. కార్లు, స్కూటర్లు అప్పట్లో లేవు. ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోనే దారి. మేకప్ ఆర్టిస్ట్ ఇబ్బంది పడి కారు తీసుకోమని సలహా ఇచ్చాడని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు సినీ నటిగా తాను ఎదుర్కొన్న సమస్యలను స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు.