సమంత మహేష్.. చైతూతో వున్నాడా? మళ్లీ కలుస్తారా?
మయోసైటిస్ చికిత్స కోసం సమంత ప్రస్తుతం సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటూ విదేశాల్లో వున్న సంగతి తెలిసిందే. ఇక నాగ చైతన్య తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ విడిపోయిన తర్వాత కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.
సమంత, నాగ చైతన్య మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. దానికి కారణం సమంత పెంపుడు కుక్క మహేష్. సమంతకు మహేష్ , సాష్ అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్న సంగతి తెలిసిందే. ఆ కుక్క సమంత, చైతూ ఇద్దరికీ దగ్గరైంది.
విడిపోయిన తర్వాత సమంత తనతో పాటు కుక్కను కూడా తీసుకెళ్లింది. చాలా సార్లు ఆమె తన కుక్కతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే సమంత, చైతన్య విడిపోయిన తర్వాత మహేష్ కుక్క మొదటిసారిగా నాగ చైతన్యతో కనిపించింది. ఓ అభిమాని కొత్త బైక్ కొని నాగ చైతన్యను కలవడానికి వెళ్లాడు. అక్కడ చైతూ పెట్ డాగ్‌తో కనిపించాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఇది సమంతా కుక్క అని అభిమానులు వ్యాఖ్యానించారు. సమంత కుక్క నాగ చైతన్యతో ఎందుకు ఉంది? మళ్లీ చైతూ దగ్గరకు మహేష్? లేక విదేశాలకు వెళ్లే ముందు సమంత కుక్కలను చైతన్య వద్ద వదిలేసిందా? అంటే వాళ్లు కాంటాక్ట్‌లో ఉన్నారా? ఇలా రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
అయితే కొన్నాళ్లుగా సమంత విదేశాలకు వెళ్లిపోవడంతో మహేష్ చైతన్యతో సన్నిహితంగా ఉంటున్నాడని, అందుకే చైతన్యతో విడిచిపెట్టిందనే టాక్ వినిపిస్తోంది.