శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (18:30 IST)

అశ్విన్ ఏ సినిమా చేసినా ముందు నాకు చూపిస్తాడు : శివం భజే ట్రైలర్ లో అనిల్ రావిపూడి

Aswin, Vishwak Sen, Anil Ravipudi, Apsar, Digangana Suryavanshi
Aswin, Vishwak Sen, Anil Ravipudi, Apsar, Digangana Suryavanshi
‘ఆట మొదలెట్టావా శంకరా’..  ‘నీ వెనకుండి నడిపిస్తున్న ఆ గుంటనక్క గురించి కూడా తెలుసురా నా కొడకా’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్‌తో శివం భజే ట్రైలర్‌లో విశ్వరూపం చూపించాడు అశ్విన్ బాబు. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం 'శివం భజే' ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతోందని ఇప్పటి వరకు వదిలిన కంటెంట్ చూస్తే అర్థం అవుతుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మంగళవారం నాడు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి మాస్ కా దాస్ విశ్వక్ సేన్, తమన్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చూశా. చాలా బాగుంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్ అనేలా ఉంది. ఆర్ఆర్ అదిరిపోయింది. అశ్విన్ కెరీర్‌లో ఇది నిలిచిపోతుందనిపిస్తుంది. అశ్విన్ ఎంతో మంచి వ్యక్తి. ట్రైలర్ చూస్తే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. ఆగస్ట్ 1న అశ్విన్‌కు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘శివం భజే ట్రైలర్ బాగుంది.. అశ్విన్ ఏ సినిమా చేసినా ముందు నాకు చూపిస్తాడు. అశ్విన్ నాకు ఓ బ్రదర్ లాంటివాడు. అశ్విన్ కెరీర్‌లో శివం భజే ది బెస్ట్ సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. శివేంద్ర నాతో పని చేశాడు. వికాస్ ఆర్ఆర్ బాగుంది. నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారికి మంచి సక్సెస్ రావాలి. డైరెక్టర్ అప్సర్ సినిమాను బాగా తీశారు. దిగంగనాకి ఈ చిత్రం పెద్ద విజయం చేకూరాలి. తమన్ ఇచ్చిన ఆర్ఆర్ ఇప్పటికీ మార్మోగిపోతూనే ఉంది. విశ్వక్‌ని ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. శివం భజే టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
 
తమన్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ రెండ్రోజుల ముందే చూశాను. డైరెక్టర్ అప్సర్, నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారికి, అశ్విన్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఓ ఆర్టిస్ట్‌కి ఒక టాలెంట్ ఉంటే సరిపోదు.. కసి కూడా ఉండదు. అశ్విన్‌కు ఆ కసి ఉంటుంది. అశ్విన్‌ బాల్‌ను ఎలా బాదుతాడో.. బాక్సాఫీస్‌ను కూడా అలానే బాదాలి. శివుడి గురించి కొట్టేటప్పుడు మనం ఏం చేయకపోయినా.. శివుడే చేయించుకుంటాడు. గత కొన్ని రోజులుగా అశ్విన్ పడుతున్న కష్టం చూస్తున్నాను. శివం భజే పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
 
డైరెక్టర్ అప్సర్ మాట్లాడుతూ.. ‘మా సినిమా ఈవెంట్‌కు వచ్చిన అనిల్ గారికి, తమన్ గారికి, విశ్వక్ సేన్ గారికి థాంక్స్. మహేశ్వరుడి కథ.. నిర్మాత మహేశ్వర్ రెడ్డి వరకు వెళ్లిందని అనిపించింది. డివోషనల్ పాయింట్ ఎందుకు పెట్టామనేది ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యేలానే చూపించాం. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని అన్నారు.
 
అశ్విన్ బాబు మాట్లాడుతూ.. ‘అనిల్ రావిపూడి, తమన్, విశ్వక్ సేన్ పిలవడంతోనే వచ్చారు. వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఒక మెసెజ్ పెట్టు వస్తాను అని అనిల్ రావిపూడి గారు అన్నారు. తమన్ నాకు పదేళ్లకు పైగా తెలుసు. తమన్ ఈ పదేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కి ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్ మా యంగ్ హీరోల్లో ఇంకెవ్వరికీ లేదు. శివం భజే కథను నిర్మాత నా వద్దకు తీసుకొచ్చారు. పాయింట్ చాలా బాగుంది. అప్సర్ గారు ఓ ముస్లిం. ఆయన ఇలాంటి కథను ఎలా రాశారని అనుకున్నా. ఇదంతా కూడా శివ లీల అనిపించింది. అవుట్ పుట్ చూస్తే ఇదంతా శివయ్యే చేయించాడని అనిపిస్తుంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని నమ్ముతాను. ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చిందని అనుకుంటాను. దిగంగనా శివ భక్తురాలు. ఈ మూవీకి మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు దొరికారు. వికాస్ బడిస మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. చాలా మంచి కాన్సెప్ట్‌తో రాబోతోన్నాం. అందరికీ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.
 
దిగంగనా సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. శివం భజే నాకు రావడం అదృష్టం. నాకు ఈ టీం అంతా కూడా ఫ్యామిలీలా మారిపోయింది. అశ్విన్ ఎంతో సహకరించారు. మా ఈవెంట్‌కు వచ్చిన అనిల్ రావిపూడి గారు, తమన్ గారు, విశ్వక్ గారికి థాంక్స్ ఈ సినిమా ఆగస్ట్ 1న రాబోతోంది. అందరూ ఆదరించండి’ అని అన్నారు.