గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (19:03 IST)

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

director Mallidi Vashishtha launched  Dirty Fellow trailer
director Mallidi Vashishtha launched Dirty Fellow trailer
శ్రీమతి గుడూరు భద్ర కాళీ సమర్పణలో  రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్  పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి  హిరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన చిత్రం  "డర్టీ ఫెలో". ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సంస్థ కార్యాలయంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ దర్శకులు మల్లిడి వశిష్ఠ ట్రైలర్ ను రిలీజ్ చేసారుర. ఈ కార్యక్రమంలో చిత్ర హీరో శాంతిచంద్ర చిత్ర దర్శకులు మూర్తి సాయి అడారి మరియు చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.  ఈ సినిమా సాంగ్స్ మధుర ఆడియో ద్వారా మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. 
 
దర్శకులు మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ: శాంతిచంద్ర హీరోగా నటించిన డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మూవీ టిమ్ సభ్యులందరికీ అభినందనలు అని అన్నారు.
 
చిత్ర హీరో శాంతిచంద్ర మాట్లాడుతూ: మా డర్టీఫెలో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి టిమ్ ని అభినందించిన మల్లిడి వశిష్ఠ గారికి ధన్యవాదములు. మే 24న డర్టీ ఫెలో సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఇటీవల మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన అన్ని పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని అన్నారు.
 
చిత్ర దర్శకులు మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ : డర్టీ ఫెలో ట్రైలర్ ను దర్శకులు వశిష్ఠ ఆవిష్కరించడం చాలా హ్యాపీగా ఉంది. మే 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉంటాయి అని అన్నారు.
 
నటి నటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ వాలా హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు