Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ - హైదరాబాద్ - కేరళ యూనివర్శిటీల్లో ప్రదర్శన

Written By వరుణ్
Updated: బుధవారం, 25 జనవరి 2023 (15:25 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు సిరీస్ డాక్యుమెంటరీలను బీబీసీ ప్రసారం చేసింది. అయితే, వీటిని భారత్‌లో ప్రసారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా పలు రకాలైన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈ డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొన్ని అనుబంధ విభాగాలు ప్రదర్శించాయి. 
 
ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీలో ప్రత్యేక స్క్రీన్లతో డాక్యుమెంటరీని ప్లే చేశారు. ఆ తర్వాత వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కేరళలోని పలు ప్రాంతాల్లో ఈ డూక్యుమెంటరీని ప్రదర్శించారు.
 
గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్లను ఇతివృత్తంగా చేసుకుని బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. దాన్ని బీబీసీ రెండు భాగాల సిరీస్‌గా ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీ ఆగ్రహావేశాలు రేకెత్తించింది. బీజేపీతో దాని అనుబంధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఎంపిక చేసిన ఫ్లాట్‌ఫారమ్‌లపై ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా కేంద్రం నిషేధించింది. 
 
అదేసమయంలో ఈ డాక్యుమెంటరీపై స్పందించేందుకు అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాలు ముందుకురాలేదు. ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న క్రేజ్‌ను తగ్గించడానికి బీబీసీ కుట్రపూరితంగా దీన్ని తయారు చేసిందని భారత మూలాలు ఉన్న ప్రవాసభారతీయులతో పాటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments