బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 జనవరి 2023 (23:09 IST)

హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం

Yamaha
యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ తమ అనుసంధానిత బ్రాండ్‌ ప్రచారం ‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ ను ప్రారంభించింది. ఈ సంవత్సరం తమ మొట్టమొదటి వీకెండ్‌ యాక్టివిటీగా హైదరాబాద్‌లో ప్రారంభించింది. ‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ వీకెండ్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌ వద్దనున్న జలవిహార్‌ వాటర్‌ పార్క్‌ వద్ద నిర్వహించారు. దాదాపు 1300 మంది యమహా అభిమానులు, బ్లూ స్ట్రీక్స్‌ నుంచి ( యమహా యజమానులతో కూడిన కమ్యూనిటీ) 1000కు పైగా రైడర్లు పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమం ద్వారా, ప్రతి మోటర్‌సైకిల్‌ అభిమానికీ సవారీలోని ఆనందం ఆస్వాదించే అవకాశం కలిగింది. దీనితో పాటుగా యమహా ప్రీమియం  మోడల్‌ శ్రేణిలో  అత్యుత్తమ సాంకేతికత, పనితీరు, భద్రతా ఫీచర్లను సైతం తెలుసుకునే అవకాశం కలిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జింఖానా రైడ్‌ లాంటి కార్యక్రమాలనూ  నిర్వహించారు. దీనిలో పాల్గొన్న అభ్యర్ధులు తమ ప్రతిభను ప్రదర్శించడంతో పాటుగా తమ సవారీ నైపుణ్యాలను సైతం మెరుగుపరుచుకునే అవకాశం కలిగింది. ఈ ఉత్సాహాన్ని  మరింతగా నిర్మించేందుకు టెస్ట్‌ రైడ్‌ కార్యకలాపాలతో పాటుగా యమహా ఉత్పత్తి శ్రేణి, యాక్ససరీలు, అప్పెరల్స్‌ జోన్‌ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మరో ప్రధానమైన ఆకర్షణగా స్టైలింగ్‌ జోన్‌ నిలిచింది. దీనిలో వినియోగదారులు  ఫేస్‌ పెయింటింగ్‌, టాటూ ఆర్ట్‌లో లీనమయ్యారు. ఈ కంపెనీ ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ ఈవెంట్లను భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో సైతం  సంవత్సరమంతా నిర్వహించడం ద్వారా  బ్రాండ్‌ నిబద్ధత పట్ల అవగాహన మెరుగుపరచనుంది.
 
‘ద కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ వీకెండ్‌  యాక్టివిటీ తో  యమహా భారతదేశ వ్యాప్తంగా తమ ఉత్సాహపూరిత శ్రేణి, స్పోర్టీ మోడల్స్‌ను ప్రదర్శిస్తుంది. వీటిలో  ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌-ఆర్‌15 వెర్షన్‌ 4.0 (155సీసీ); ఏబీఎస్‌తో వైజడ్‌ఎఫ్‌-ఆర్‌15ఎస్‌ వెర్షన్‌ 3.0 (155 సీసీ); ఏబీఎస్‌తో ఎంటీ-15 (155 సీసీ) వెర్షన్‌ 2.0; బ్లూ కోర్‌ టెక్నాలజీ ఆధారిత మోడల్స్‌ అయిన ఎఫ్‌జెడ్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఫేజర్‌ 25 (249 సీసీ) ఏబీఎస్‌తో, ఎఫ్‌జడ్‌–ఎస్‌ ఎఫ్‌1 (149 సీసీ) ఏబీఎస్‌తో,  ఎఫ్‌జెడ్‌–ఎఫ్‌1(14సీసీ) ఏబీఎస్‌తో; ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌(149సీసీ) ఏబీఎస్‌తో, యుబీఎస్‌ ఆధారిత స్కూటర్లు అయిన ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), రేజెడ్‌ఆర్‌ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ), స్ట్రీట్‌ ర్యాలీ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌ (125సీసీ) ఉంటాయి.