1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (13:45 IST)

వన్ ఛాయ్ ప్లీజ్.. రోడ్ సైడ్ టీ షాపులో బిల్ గేట్స్

Bill Gates
Bill Gates
తన భారత పర్యటన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, రోడ్ సైడ్ టీ స్టాల్ నుండి ఒక కప్పు చాయ్‌ను ఆర్డర్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఫుటేజీలో, గేట్స్ చాయ్‌వాలాను వన్ ఛాయ్ ప్లీజ్ అని అడగడం.. రోడ్ సైడ్ బాయ్ టీ తయారు చేసి.. ఆయనకు ఇవ్వడం చూడవచ్చు. 
 
ఈ సందర్భంగా టీ స్టాల్ డాలీ చాయ్‌వాలాతో బిల్ గేట్స్ సన్నిహితంగా కనిపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సుమారు 4 మిలియన్ల వీక్షణలు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 300,000 లైక్‌లను సంపాదించిన ఈ వీడియోను బట్టి బిల్ గేట్స్‌కు భారతీయ సంస్కృతిపై వున్న మక్కువకు అద్దం పడుతుందని నెటిజన్లు అంటున్నారు.