శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 28 అక్టోబరు 2021 (17:07 IST)

హమ్మయ్య, ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ మంజూరు, షారూక్ ఖాన్ హ్యాపీ

క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ప్రత్యేక కోర్టు తమ బెయిల్ దరఖాస్తులను తిరస్కరించినందుకు వ్యతిరేకంగా చేసిన పిటిషన్‌లో ఆర్యన్ ఖాన్- సహ నిందితులు అర్బాజ్, మున్మున్ ధమేచాలకు బొంబాయి హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్డర్ యొక్క ఆపరేటివ్ భాగం రేపటిలోగా రీజనేడ్ ఆర్డర్‌తో అందుబాటులోకి వస్తుంది. ఈ రాత్రికి నిందితులు జైలు నుంచి విడుదల కానున్నారు.

 
గురువారం హైకోర్టు విచారణ సందర్భంగా ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) న్యాయవాది ఎఎస్‌జి అనిల్ సింగ్ మాట్లాడుతూ, దరఖాస్తుదారు ఆర్యన్ ఖాన్ ఫస్ట్ హ్యాండ్ వినియోగదారు కాదని, గత రెండేళ్లుగా డ్రగ్స్ సాధారణ వినియోగదారు అని అన్నారు. నిందితుడు ఆర్యన్ చేతన నిషిద్ధ వస్తువులు ఉన్నట్లు గుర్తించబడ్డాడు," అని సింగ్ వాదించారు.

 
కాగా ఆర్యన్ తరపు న్యాయవాది కోర్టులో తమ వాదన వినిపించారు. అసలు ఆర్యన్, అతడి స్నేహితుల అరెస్ట్ చట్టవిరుద్దమైనవన్నారు. ముందస్తు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఆర్యన్ కి బెయిలు మంజూరు చేసింది.