ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (11:08 IST)

ఈ కేరళ వ్యక్తి అదృష్టవంతుడు.. లక్కియస్ట్ మ్యాన్‌ ఆఫ్ ది మంత్‌ అవార్డు అతనికే..? (video)

Kerala Man
2020 సంవత్సరం కరోనా మింగేస్తుందనే చెప్పాలి. అలాంటి ఈ నెలలో ఇతడే అదృష్టమైన వ్యక్తి అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎందుకంటే.. అతివేగంతో వస్తున్న వాహనం అంగుళం గ్యాప్‌తో మనిషి పక్క నుంచి వెళ్లింది. అంతే ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇతన్నీ అందరూ లక్కియస్ట్ మ్యాన్ ఆఫ్ ది మంత్ అని అంటున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు మీద ఎడమచేతి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుక నుంచి చాలా వాహనాలు వస్తున్నాయి. రోడ్డుకి అంచున నడుస్తుండడంతో అతనికి ఏం కాలేదు. ఒక వాహనం మాత్రం రయ్.. రయ్‌ మంటూ అతని మీదకు దూసుకువచ్చింది.
 
వాహనం వెళ్లిన వేగానికి ఆ వ్యక్తి కిందపడి నుజ్జునుజ్జు అయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ అతను క్షేమంగా రోడ్డు మీదనే ఉన్నాడు. చూసినవారికే అలా ఉంటే ఇక ఆ వ్యక్తికి ఇంకెలా ఉంటుంది. దేవుడా తప్పించుకున్నాను అంటూ రోడ్డు పక్కకి పరుగులు పెట్టాడు. 
 
22 సెకన్ల పాటు నడిచే ఈ వీడియోను మైక్రో- బ్లాగింగ్ సైట్ యూజర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'లక్కియస్ట్ మ్యాన్‌ ఆఫ్ ది మంత్‌ అవార్డు ఈ వ్యక్తికి వెళుతుంది' అనే శీర్షికను జోడించారు. ఈ శీర్షిక అతనికి సరైనదని అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.