శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By వరుణ్
Last Updated : శనివారం, 18 నవంబరు 2023 (11:22 IST)

చాట్‌జీపీటీ ఈసీవోకు ఉద్వాసన .. ఎందుకో తెలుసా?

sam altman
నేటి అధునాతన సాంకేతిక యుగంలో పెను సంచలనంగా మారిన కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) ఆధారిత టెక్నాలజీ చాటిపీట్‌ ఆవిష్కర్త శామ్ ఆల్ట్‌మన్‌ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక మద్దతు గల ఓపెన్ఏఐ సంస్థ శామ్ ఆల్ట్‌మన్‌ను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ సీఈవోగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఓపెన్ఏఐ సంస్థ బోర్డు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. శామ్ ఆల్ట్‌మన్ తొలగింపు టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. 
 
'ఆల్ట్‌మన్ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదు. సరైన సమాచారం పంచుకోవడం లేదు. బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడు. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదు' అని ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంపై ఆల్ట్‌మన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
'ఓపెన్ఏఐ సంస్థలో పనిచేయడాన్ని ఎంతో ఇష్టపడ్డాను. వ్యక్తిగతంగా నేను మారడానికి, ప్రపంచాన్ని కొంచెం మారిందనడానికి నేను నమ్ముతున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో మంది ప్రతిభావంతులైన వారితో పనిచేయడాన్ని ఇష్టపడ్డాను' అని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ జీపీటీని ఇటీవలకాలంలో పరిచయం చేసినప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఈ చాట్‌బో సహాయంతో కేవలం సెకన్లలోనే మనకు కావాల్సిన ఖచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు. చాట్ జీపీటీ ఉపయోగాలు ఎన్ని ఉన్నప్పటికీ అంతే సంఖ్యలో నష్టాలు సైతం ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.