ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జూన్ 2018 (16:09 IST)

చికాగో వ్యభిచార దందా : తెలుగోళ్లకి యుఎస్ వీసాలు తిరస్కరణ

ఇటీవల చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాతో భారతీయులకు అమెరికా కాన్సులేట్ వీసాలను తిరస్కరిస్తోంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి 10 మందిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే వీసాలను మంజూరు చేస్తున్నారు. ముఖ్యంగా,

ఇటీవల చికాగోలో వెలుగు చూసిన వ్యభిచార దందాతో భారతీయులకు అమెరికా కాన్సులేట్ వీసాలను తిరస్కరిస్తోంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి 10 మందిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే వీసాలను మంజూరు చేస్తున్నారు. ముఖ్యంగా, వెండితెర, బుల్లితెర, ఇతర రంగాల వారికి ఇది చేదు అనుభవంతో సమానం.
 
ఇటీవల చికాగోలో తెలుగు హీరోయిన్ల వ్యభిచార దందా వెలుగు చూసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఎన్నారై మొదుగుమూడి కిషన్ ఆయన భార్య చంద్రలను యుఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారం చేయడానికి నిరాకరించిన ఓ హీరోయిన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ డొంక కదిలింది. 
 
దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళ్లి సినీ, టీవీ కళాకారులతో పాటు ఇతరులపై కూడా అమెరికా కాన్సులేట్ అధికారులు నిఘా పెంచారు. అదేసమయంలో తమ వ్యక్తిగత పనుల నిమిత్తంతో పాటు యుఎస్‌లోని తెలుగు సంస్థల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికి చేదు అనుభవం ఎదురవుతుంది. 
 
వీరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అమెరికా వెళ్లనున్న బృందం కూడా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 24 మందితో కూడిన బృందం అమెరికా తెలంగాణ సదస్సుకు వెళ్లడానికి వీసా ఇవ్వాలని అభ్యర్థిస్తూ లేఖ రాసింది. ఆ దరఖాస్తులను పరిశీలించిన కాన్సులేట్‌ ప్రతినిధి నలుగురికే వీసా ఇస్తామని ముందస్తు సమాచారం ఇచ్చి మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరించింది.
 
అలాగే, హైదరాబాద్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మేక మహేందర్‌ రెడ్డి తన వ్యక్తిగత పనుల కోసం, డ్యాన్సర్, టీవీ ఆర్టిస్టు సురేఖరాణిలు అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరూ ఇంటర్వ్యూకు కూడా వెళ్లారు. వీరిద్దరినీ అమెరికా ఎందుకు వెళుతున్నారనీ ప్రశ్నించిన సిబ్బంది... ఆ తర్వాత మరోమాట చెప్పకుండా వీసా తిరస్కరణ పత్రాన్ని చేతిలో పెట్టారు. 
 
నిజానికి తానా, ఆటా, నాటా ఇలా ఏ సదస్సుకు హాజరవుతామని దరఖాస్తు చేసినా 60 శాతం నుంచి 75 శాతం మందికి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సదస్సులకు వెళతామని అంటున్న వారికి ఏ ప్రశ్నలూ లేకుండానే వీసా తిరస్కరిస్తున్నారు. గత 15 రోజుల్లో ఇలా వెళ్లిన వారిలో 90 శాతం మందికి వీసా ఇవ్వడానికి యూఎస్‌ కాన్సులేట్‌ తిరస్కరించడం గమనార్హం.