శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : ఆదివారం, 17 జూన్ 2018 (12:02 IST)

ట్రెండింగ్ - ఈ చెయ్యి ఎవరిదో చెప్పండి రేణూ గారూ..?

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకుల అనంతరం నటి రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో పవన్ వీరాభి

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో విడాకుల అనంతరం నటి రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాదు ఒకానొక సందర్భంలో పవన్ వీరాభిమానులు ఆమె మరో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.


దీంతో మగాళ్లు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా తప్పులేదు.. తాను రెండో పెళ్లి చేసుకుంటే తప్పేంటి అన్నట్లుగా పవన్ అభిమానులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్‌తో పవన్ ఫ్యాన్స్ ఆమె జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం రేణు దేశాయ్‌కి జీవిత భాగస్వామి దొరికినట్లున్నారు. 
 
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్, ప్రస్తుతం పోస్ట్ చేసిన ఫోటో హాట్ టాపిక్‌గా మారింది. చేతిలో చెయ్యి వేసివున్న ఓ ఫొటోను పెట్టిన రేణూ దేశాయ్ సదరు వ్యక్తి స్పెషాలిటీని కవిత రూపంలో చెప్పింది. "స్వచ్ఛమైన ప్రేమ కోసం ఇన్నాళ్లూ చాలా చోట్ల వెతికాను. చివరకు నీ రూపంలో ఆ ప్రేమ దొరికిందని భావిస్తున్నాను. నా చేయిని జీవితాంతం విడువకు" అని రేణు దేశాయ్ వ్యాఖ్యానించింది. 
 
ఈ పోస్టుతో రేణూ దేశాయ్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఆ చెయ్యి ఎవరిదో చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మాత్రం రేణు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి రేణు దేశాయ్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.