ఇప్పుడు ఎక్కడో కాలింది.. పవన్ మల్లెపూలని మాత్రమే నలపగలరా?: మాధవీలత
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై టీడీపీ మహిళా నేత సాధినేని యామిని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై సినీతార, బీజేపీ నేత మాధవీలత విమర్శలు గుప్పించింది. పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పిస్తూ యామిని చేసిన వ్యాఖ్యలపై మాధవీలత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతు నిర్వహించి, ఆపై జరిగిన బహిరంగ సభలో టీడీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను చర్చకు దారితీశాయి. పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ టీడీపీ మహిళా నేత సాధినేని యామిని సోషల్ మీడియాలో పెట్టిన వ్యాఖ్యలపై పవన్ వీరాభిమానిగా చెప్పుకునే నటి మాధవీలత తీవ్రంగా మండిపడింది. ఇన్నాళ్లు తనకెందుకులే అని ఊరుకున్నాను. ఇప్పేడే తనకు ఎక్కడో కాలిందని యామిని మండిపడింది.
''మల్లెపూల విషయం ఏంటో దగ్గర్నుంచి యామిని సాధినేని చూశారేమో?'' చూసినప్పుడు అడగాలి కదా ఇప్పుడెందుకు అడగటం? వారసత్వం గురించి మాట్లాడే హక్కు లేదా? నిజమే ఎందుకంటే ఆయన వారసత్వంతో రాలేదు కదా? తెలియదులేమ్మా.. కవాతు దేనికోసమా? ఏం చేశాడనా? ఏం చేయలేదు?.. అంటూ మాధనీ లత ప్రశ్నించింది.
మీరు చేయలేనివి పవన్ చేసేద్దామనే తపనతో వున్నారు. ఆయన వ్యక్తిగత జీవితం మీద పడి ఏడవడమే తప్ప.. మీకీ పీకడానికి వేరు లేవు కదా అంటూ మాధవీలత ఎద్దేవా చేసింది. మొన్నటి దాకా బీజేపీ డబ్బులు తీసుకున్నాడని, నిన్నేమో ఎవరివో డబ్బులు ఖర్చుపెట్టాడని చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, "మీ అయ్యలు ఇచ్చారా? మీ తాతలు ఇచ్చారా?... ఇవ్వలేదుగా ఇంక మళ్లీ నొప్పెందుకు పైసలు ఇవ్వకుండా ఇంతమంది జనం ఎందుకు వచ్చారనా? ఉంటదిలే కడుపులో మంట" అని తన ఫేస్‌బుక్‌లో యామినీకి మాధవీ లత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే... టీడీపీ మహిళా నేత సాధినేని యామినీ పవన్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వారసత్వం గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదని, పావలాకు కూడా చెల్లని పవన్ కల్యాణ్ రెండువేల రూపాయిల నోటువంటి లోకేశ్‌బాబు గురించి మాట్లాడటం నిజంగా హాస్యాస్పదమని యామినీ విమర్శించారు.
అంతేకాకుండా గాంధేయవాదిని అని చెప్పుకునే పవన్ తాట తీస్తా, తోలు తీస్తా అంటున్నారు, మీరు ఎవరి తాట తీయగలరు? కూర్చొని మల్లెపూలని మాత్రమే నలపగలరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యామిని వ్యాఖ్యలపై టాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు, పవన్ వీరాభిమానిగా చెప్పుకునే మాధవీ లత ఫేస్‌బుక్ వేదికగా యామినీపై నిప్పులు చెరిగారు.