ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఆగస్టు 2022 (14:28 IST)

29న రియలన్స్ 45వ వార్షిక సర్వ సభ్య సమావేశం

mukesh ambani
భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం ముంబైలో జరుగనుంది. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి ఈ ఏజీఎస్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశానికి రిలయన్స్‌లోని వాటాదారులందరినీ పిలిచి ముంబై వేదికగా అట్టహాసంగా ఈ వేదికను నిర్వహిస్తారు. 
 
ఇందులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కంపెనీకి సంబంధించిన కొత్త వ్యూహాలు, పెట్టుబడులు, భాగస్వామ్యాలను ప్రకటిస్తారు. రిలయన్స్‌కు సంబంధించిన ఏ కీలక సమాచారాన్ని ఈ వేదికపై నుంచి ప్రకటిస్తారు. అలాగే, రిలయన్స్‌కు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయమైనా ఈ వేదిక నుంచే తీసుకుంటారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం జరుగనున్న రిలయన్స్ 45వ ఏజీఎంపై ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకతృతమైంది. ప్రత్యేకించి ఏజీఎంలో ముఖేష్ అంబానీ ఎలాంటి వ్యూహాలు ప్రకటిస్తారన్న విషయంపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే సాగుతోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 5జీ సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
ఈ సేవలను వీలైనంత త్వరగా దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి దేశంలోని టెలికాం రంగంలో అగ్రగామిగా అయ్యేందుకు ఆయన ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, 5జీ సేవలు, దానికి సంబంధించిన మొబైల్ ఫోన్లపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.