శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (14:09 IST)

ఆరు యూఎస్ టెక్ దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా భారత సంతతివారే...

విదేశాల్లో భారతీయులతో పాటు భారతీయ సంతతికి చెందిన ప్రతిభావంతులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే అనేక మంది భారత సంతతి వారు అనేక ప్రపంచ దేశాల్లో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాగే, ఇపుడు మరో అంతర్జాతీయ సంస్థకు మరో భారత సంతతికి చెందిన వ్యక్తి అధిపతిగా నియమితులయ్యారు. ఆయన ఎవరో వారు పరాగ్ అనురాగ్.
 
మైక్రోసాఫ్ట్, గూగూల్, అడోబ్, ఐబీఎం, మైక్రాన్, మాస్టర్ కార్డ్ సంస్థలకు భారతీయులు భారత సంతతికి చెందిన వ్యక్తుల సీఈవోలుగా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీలన్నింటికీ భారత్‌లో పుట్టి పెరిగిన వారే సీఈవోలుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇందులో ఆరు అంతర్జాతీయ కంపెనీలు అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలు కావడం గమనార్హం. 
 
మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదెళ్ల, గూగుల్‌ సీఈవోగా సుందర్ పిచ్చాయ్, అడోబ్ సీఈవోగా శాంతను నారాయణ, ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణ, మైక్రాన్‌కు సంజయ్ మెహ్రోత్రా, మాస్టర్ కార్డ్‌కు అజయ్ బంగా ఉన్నారు. అయితే, అజయ్ బంగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మాస్టర్ కార్డ్ అధిపతిగా ప్రస్తుతం మైఖైల్ మిబేచ్ కొనసాగుతున్నారు. తాజాగా ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. 
 
ఎవరీ పరాగ్ అగర్వాల్?
బాంబే ఐఐటీ, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పూర్వ విద్యార్థి. పదేళ్ళ క్రితం ట్విట్టర్‌లో యాడ్స్ ఇంజనీర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ 2017లో సంస్థ టెక్నాలజీ అధిపతిగా పదోన్నతి సాధించారు. ఇపుడు సీఈవోగా ఎన్నికయ్యారు. 
 
గతంలో మైక్రోసాఫ్ట్, యాహూ తదితర సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. ట్విట్టర్ సీఈవోగా నియమితులైన తర్వాత పరాగ్ అనురాగ్ స్పందిస్తూ, "ఈ బాధ్యతనాకు రావడం పట్ల గర్వపడుతున్నాు. డోర్సే మార్గదర్శత్వాన్ని కూడా కొనసాగిస్తాను. ఆయన స్నేహానికి కృతజ్ఞతలు" అంటూ పేర్కొన్నారు.